MLC Elections, 2025
East-West Godavari Graduates Constituency
INDEPENDENT CANDIDATE
#YouthInPolitics #21stCenturyReformer #CatalystOfChange
MILESTONES OF MERIT
నిజమైన ప్రజాస్వామ్యం రావాలి.
ప్రజల హక్కులు వారికి తెలియాలి.
ఆ హక్కులు ఎలా సాధించాలో తెలిసేలా చేయాలి.
నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందలి.
అవినీతి, లంచం, రౌడీయిజం నశించాలి.
అందరికీ సత్వర న్యాయం జరగాలి.
సమాజం లో సమానత్వం తీసుకురావాలి.
చదువుకి తగ్గ పని, పనికి తగ్గ జీతం లభించాలి.
సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందాలి.
కుల మత జాతి భాష ప్రాంతీయ భేదాల కన్నా మానవత్వమే గొప్పదన్న సంస్కృతి తీసుకురావాలి.
మెరుగైన శాంతి భద్రతలు కల్పించాలి.
పేదరికాన్ని నిర్మూలించాలి.
అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి.
ఇలాంటి ఆశయాలతో రాబోయే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నాను.
నా పేరు బొమ్మిడి సన్నీ రాజ్.
విద్యావంతులు, నేర చరిత్ర లేకుండా, సొంత ప్రయోజనాలకోసం పార్టీ ప్రయోజనాలకోసం కాకుండా.. దేశ ప్రయోజనాలకోసం, రాష్ట్ర ప్రయోజనాలకోసం, ఆశయాలు, సిద్ధాంతాలతో ఉత్సహవంతమైన యువత చట్టసభ లో ప్రజా ప్రతినిధులు గా నిలబడాలి అనే ఉద్దేశం తో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
కులం, మతం, మందు, డబ్బు లేకుండా మెరిట్ ఆధారంగా, ఆలోచనా విధానాలు, ఆశయాలు, సిద్ధాంతాలు, అర్హత చూసి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
1. నిజమైన ప్రజాస్వామ్యం
2. చట్టబద్ధమైన పాలన ; సమానత్వం
3. మెరుగైన జీవన నాణ్యతతో గౌరవావరదమైన జీవన విధానం
4. సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం
5. జాతి, మతం, కులం, వర్గం, ప్రాంతీయత మొదలైన బేధాలకన్నా మానవతావాదం మరియు హేతుబద్ధత తో ఆలోచించే సమాజ స్థాపన .
6. తక్కువ సమయం లో తక్కువ ఖర్చుతో లోపాలు లేని న్యాయం
7. పారదర్శక మరియు జవాబుదారీ ప్రభుత్వ కార్యాలయాలు; అవినీతి లేని సేవలు
8. మెరుగైన ప్రజా భద్రత ; రాజకీయ నియంత్రణ నుండి పోలీసు వ్యవస్థకు విముక్తి
9. చదువుకి తగ్గ పని, పనికి తగ్గ జీతం ; వ్యసనాలు లేని యువత; పేదరిక నిర్ములన
10. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలి
11. మానవ మూలధనాన్ని మెరుగుపరచి యోగ్యత గలవారికే పదవులు, బాధ్యతలు